హైదరాబాద్ లో నడి రోడ్డుపై నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ వ్యాపారి!
- సనత్ నగర్ లో ఉదయం 7 గంటల సమయంలో ఘటన
- నిప్పంటించుకున్న వ్యాపారి వెంకటేష్ గుప్తా
- నష్టాలే కారణమని సమాచారం
కొన్నేళ్లుగా వ్యాపారం నిర్వహిస్తున్న గుప్తా, తీవ్ర నష్టాలు రావడంతో మనస్తాపంతోనే ఈ పని చేసినట్టు తెలుస్తోంది. ఆయన సజీవ దహనమవుతున్న దృశ్యాలు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. సజీవ దహనంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.