ముగింపు దశలో శర్వానంద్ మూవీ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ముగింపు దశలో శర్వానంద్ మూవీ

  • శర్వానంద్ నుంచి 27వ సినిమా
  • నాయికలుగా కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్
  •  మే నెలలో విడుదల  
శర్వానంద్ .. సుధీర్ వర్మ కాంబినేషన్లో ఒక సినిమా రూపొందుతోంది. శర్వానంద్ కి ఇది 27వ సినిమా .. సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇంతవరకూ ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. ఈ రోజున శర్వానంద్ పుట్టినరోజు కావడంతో, టైటిల్ ను ఖరారు చేసి ఫస్టులుక్ పోస్టర్ ను వదిలే అవకాశం వున్నట్టుగా వార్తలు వచ్చాయి.

కానీ టైటిల్ ఇంకా ఖరారు కాలేదేమో .. బర్త్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక స్పెషల్ పోస్టర్ ను మాత్రం వదిలారు. ఇటీవలే ఈ సినిమా స్పెయిన్ లో కొన్ని రోజుల పాటు షూటింగ్ జరుపుకుని వచ్చింది. కొన్ని సీన్స్ తో పాటు రెండు పాటలు మాత్రమే పెండింగ్ లో వున్నట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోనే వీటిని చిత్రీకరించనున్నారట. కాజల్ .. కల్యాణి ప్రియదర్శన్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాను, మే నెలలో విడుదల చేయనున్నారు. 
sharwanand
kajal
kalyanipriyadarshan

More Telugu News