విపక్ష నేతల అనుమానాలు పాక్ మీడియాలో ముఖ్యాంశాలుగా ప్రసారం అవుతున్నాయి: ప్రధాని మోదీ
- ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారికి గట్టి జవాబిచ్చాం
- సరిదిద్దుకోవడం మినహా వారికి మరోమార్గం లేదు
- దాడులు పాక్ లో జరిగితే ఆ దెబ్బలు భారత్ లో కొందరికి తగిలాయి
భారత వైమానిక దాడులు పాకిస్థాన్ లో జరిగాయి కానీ, ఆ దెబ్బలు భారత్ లో ఉన్న కొంతమందికి తగిలాయంటూ విపక్ష నేతలపై విరుచుకుపడ్డారు. వైమానిక దాడులపై విపక్ష నేతలు వ్యక్తం చేస్తున్న అనుమానాలు పాకిస్థాన్ మీడియాలో ముఖ్యాంశాలుగా ప్రసారం అవుతున్నాయని, అక్కడి టీవీ ఛానెళ్లలో వీరి ముఖాలే కనిపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఈ మహా కల్తీ కూటమి నేతలు పాకిస్థాన్ కు ముఖచిత్రంగా మారారని, భారత్ జరిపిన వైమానిక దాడులకు ఆధారాలు కావాలని, ఉగ్రవాదులు ఎంత మంది మరణించారో అడుగుతున్నారని, వీళ్లు పాకిస్థాన్ ను కూడా శాంతి దూతగా అభివర్ణిస్తున్నారని దుయ్యబట్టారు.