YSRCP: అలా అయితే, వైఎస్ జగన్ ఇప్పటికే ఐదుసార్లు సీఎం అయ్యేవారు!: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
డబ్బుతో రాజకీయాలు చేసేయొచ్చని అనుకుంటే ఏపీ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఐదారుసార్లు ముఖ్యమంత్రి అయి ఉండేవారని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ, ఓ బలమైన మార్పు కావాలని కోరుకుంటున్నప్పుడు అది ఓ సునామీలా వచ్చి ఉన్న వ్యవస్థని తుడిచిపెట్టేస్తుందని, తనలో బలమైన మార్పు తీసుకురావాలన్న ఆకాంక్ష ఉందని మరోసారి స్పష్టం చేశారు. ‘జనసేన’తో కలిసి నడవాలనుకున్న వారు సుదీర్ఘ ప్రయాణం పెట్టుకోవాలని, 2019లో అద్భుతాలు జరుగుతాయని మాత్రం అనుకోవద్దని తమ కార్యకర్తలకు సూచించారు. ఒక్కో సమయంలో భగవంతుడు ఆశ్చర్యకరరీతిలో ఫలితం ఇవ్వొచ్చని, ప్రత్యర్థులు ‘జనసేన’కు బలం లేదనడం సబబు కాదని, తమకు బలం ఉందని పవన్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
YSRCP
jagan
jana sena
Pawan Kalyan
ap

More Telugu News