పాటల కోసం యూరప్ వెళుతోన్న 'ఆర్ ఎక్స్ 100' హీరో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పాటల కోసం యూరప్ వెళుతోన్న 'ఆర్ ఎక్స్ 100' హీరో

  • ఒంగోలులో తొలి షెడ్యూల్ పూర్తి
  •  40 శాతం చిత్రీకరణ పూర్తి
  •  మార్చి 5 నుంచి రెండవ షెడ్యూల్  
'ఆర్ ఎక్స్ 100' సినిమాతో యూత్ లో కార్తికేయ విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్నాడు. ఆయన తదుపరి సినిమా కోసం ప్రేక్షకులలో ఎంతో ఆసక్తి వుంది. ప్రస్తుతం కార్తికేయ హీరోగా రెండు సినిమాలు సెట్స్ పై వున్నాయి. వాటిలో ఒక సినిమా అనిల్ కడియాల - తిరుమల రెడ్డి నిర్మాణంలో, అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో రూపొందుతోంది.

రీసెంట్ గా ఈ సినిమా తొలి షెడ్యూల్ ను పూర్తి చేశారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ .. "తొలి షెడ్యూల్ షూటింగ్ ఒంగోలులో జరిగింది. ప్రధానమైన పాత్రల కాంబినేషన్లోని కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను 25 రోజుల పాటు అక్కడ చిత్రీకరించాము. దాదాపు 40 శాతం చిత్రీకరణను పూర్తిచేశాము .. అవుట్ పుట్ చాలా బాగా వచ్చింది. తదుపరి షెడ్యూల్ ను మార్చి 5వ తేదీ నుంచి యూరప్ లోని 'క్రొయోషియా'లో ప్లాన్ చేశాము. అక్కడ రెండు పాటలను చిత్రీకరించనున్నాము" అని చెప్పుకొచ్చాడు.
karthikeya

More Telugu News