ఐఏఎఫ్ అంటే 'ఇండియన్ అమేజింగ్ ఫైటర్స్': మమతా బెనర్జీ

  • 'జై హింద్' అని ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన మమత
  • ప్రతి భారతీయుడూ అభినందించాలి
  • అమర జవాన్ల ఆత్మలు శాంతిస్తాయన్న మమత
భారత వాయుసేన జరిపిన దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ఐఏఎఫ్ అంటే 'ఇండియన్ అమేజింగ్ ఫైటర్స్' అని అభివర్ణించిన ఆమె, 'జై హింద్' అని వ్యాఖ్యానించారు. వైమానిక దళాలు చేసిన ఈ దాడులపై ప్రతి భారతీయుడూ అభినందించాల్సిందేనని అన్నారు. భరతమాత కోసం ప్రాణాలను అర్పించిన వారి ఆత్మలు ఈ దాడిని చూసి శాంతిస్తాయని పేర్కొన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చేసిన సర్జికల్ స్ట్రయిక్స్ పై పలువురు సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్స్ అభినందనలు తెలుపుతున్నారు.



Go Back to Shorts
Mamata Benergee
Indian Air Force
Jai Hind
Twitter

More Telugu News