చిరంజీవి టైటిల్‌తో రాబోతున్న నాని
- ‘గ్యాంగ్ లీడర్’ టైటిల్‌తో రాబోతున్న నాని
- నాని పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటన
- ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం
ఈ చిత్రంలో నాని నవలా రచయితగా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ‘RX 100’ ఫేమ్ కార్తికేయ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. ఈ చిత్రం ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టైటిల్ విషయమై నాని ట్వీట్ చేశాడు. ‘గడ్డంతో కూడిన లుక్, చేతుల్లో వెల్డింగ్ గన్.. ఇప్పటికీ గుర్తు. చిన్నారిగా మొదటి రోజు మొదటి షో.. మిగిలినదంతా చరిత్ర. ఒక అభిమాని నాని 24 టైటిల్ ప్రకటిస్తున్నాడు’ అంటూ టైటిల్ గురించి వివరిస్తున్న ఓ చిన్న వీడియోను నాని షేర్ చేశాడు.