న్యాయం కోసం కేంద్రాన్ని నిలదీస్తున్న చంద్రబాబుపై ఎదురు దాడి చేస్తారా?: అమిత్ షాపై కళా వెంకట్రావు ఫైర్
- ప్రత్యేక హోదాపై ‘బీజేపీ ‘యూటర్న్’ తీసుకుంది
- మోదీ కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారు
- చంద్రబాబుపై వ్యక్తిగత విమర్శలు తగదు
ఏపీకి వివిధ పద్దుల కింద రూ.14 వేల కోట్లు ఇచ్చినట్లు పార్లమెంట్ లో చెప్పారని, దీనిపై బీజేపీ నాయకులు తమ బహిరంగ సభల్లో తలా ఒక లెక్క చెబుతున్నారని విమర్శించారు. ఉమ్మడి సంస్థల విభజన ఇప్పటి వరకూ జరగలేదని విమర్శించారు. టీడీపీతో పొత్తు వల్లే బీజేపీకి 2014 ఎన్నికల్లో ఏపీలో 4 సీట్లు వచ్చాయని, రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసేందుకు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని అన్నారు. మోదీ నియంతృత్వాన్ని నిలువరించేందుకే దేశ స్థాయిలో ప్రత్యామ్నాయ కూటమిని ఏర్పాటు చేశామని, రాబోయే ‘మహాకూటమి’ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని ఆ లేఖలో కళావెంకట్రావు పేర్కొన్నారు.