nani: నిర్మాతగాను బిజీ అవుతోన్న నాని

షార్ట్స్‌లో చూడండి
హీరోగా నాని వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. 'జెర్సీ'ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న ఆయన, తదుపరి సినిమాను విక్రమ్ కుమార్ తో చేస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ సినిమా తరువాత ఆయన మోహనకృష్ణ ఇంద్రగంటితో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడు. ఈ సినిమాకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, సహ నిర్మాతగా నాని వ్యవహరించనున్నాడు.

ఇక ఈ సినిమా తరువాత నిర్మాతగా ఆయన మరో ప్రాజెక్టును లైన్లో పెట్టేసినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా సందీప్ రాజ్ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయం కానున్నట్టుగా సమాచారం. 'అ' సినిమా తరహాలో ఈ సినిమా కూడా ప్రయోగాత్మకంగా ఉండనుందని అంటున్నారు. గతంలో నాని నిర్మించిన 'అ' సినిమా ఆశించినస్థాయిలో ఆదరణ పొందకపోయినా, ఆయన మళ్లీ నిర్మాతగా కొత్త ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
Go Back to Shorts
nani
indraganti

More Telugu News