Chandrababu: నాలుగు ఎంపీ స్థానాల్లో సమీక్షలు పూర్తయ్యాయి: చంద్రబాబు

షార్ట్స్‌లో చూడండి
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సమీక్షలు జరుపుతున్నామని టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ఉదయం టీడీపీ నేతలతో ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాలుగు ఎంపీ స్థానాల్లో ఇప్పటికే సమీక్షలు పూర్తయ్యాయని చెప్పారు. అన్ని అసెంబ్లీ స్థానాలకు సమన్వయ కమిటీలు, ఏరియా కోఆర్డినేటర్లను నియమించామని తెలిపారు.

రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నేతలకు చంద్రబాబు సూచించారు. పార్టీ గెలుపులో అందరూ భాగస్వాములు కావాలని చెప్పారు. ఉద్యోగ సంఘాలతో నిన్న జరిగిన భేటీ సంతృప్తినిచ్చిందని... టీడీపీ మళ్లీ అధికారంలోకి రావాలని ఉద్యోగులు కోరుకుంటున్నారని తెలిపారు. ఎన్నికల తరుణంలో వైసీపీ నేతలు పలు రకాల కుట్రలకు పాల్పడతారని... వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలని చెప్పారు.
Go Back to Shorts
Chandrababu
mp
seats
Telugudesam

More Telugu News