భరోసా లేకపోవడం వలన .. సర్దుకుపోతూ వచ్చాను: సీనియర్ నటి అన్నపూర్ణ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

భరోసా లేకపోవడం వలన .. సర్దుకుపోతూ వచ్చాను: సీనియర్ నటి అన్నపూర్ణ

  • అప్పట్లో ఇండస్ట్రీకి రావడం నా అదృష్టం
  • ఇక్కడ మసలుకోవడం చాలా కష్టం
  •  భరోసా లేకపోవడమే కారణం    
కొడుకును ప్రాణంగా చూసుకునే ఒక పేదరాలైన తల్లిగా .. భర్తను కనిపెట్టుకునుండే ఒక మధ్యతరగతి భార్యగా అన్నపూర్ణ ఎన్నో సినిమాల్లో నటించారు. అలాంటి ఆమె ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. " ఈ మధ్యనే నేను ఇండస్ట్రీకి వచ్చినట్లయితే .. నేను చేసిన పాత్రలను జనం వెంటనే మరిచిపోయేవారు.

చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి రావడం వలన విభిన్నమైన పాత్రలను చేయగలిగాను. అగ్ర హీరోలందరికీ తల్లిగా చేయగలిగాను. అప్పట్లో వాళ్లంతా డైమండ్స్ .. వాళ్ల మధ్యలో బంగారంలా మెరిసే అవకాశం లభించింది. ఒకసారి రావుగోపాలరావు గారు .. 'కారు కొనుక్కో అమ్మా .. పారితోషికం పెరుగుతుంది' అన్నారు. ఆ విషయం అమ్మకి చెబితే వద్దని అంది. ఇది సెక్యూరిటీ వున్న జాబ్ కాదు. ఎవరికి కోపం వచ్చినా మేమే ఇంటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. ఎక్కువ మాట్లాడినా సమస్యే .. తక్కువ మాట్లాడినా కష్టమే. భరోసా లేకపోవడం వలన .. సర్దుకుపోతూ వచ్చాను" అని చెప్పుకొచ్చారు.
annapurna

More Telugu News