జనసేన టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్న పవన్.. వడపోత కమిటీకి దరఖాస్తు సమర్పణ
- సమావేశమైన జనసేన పీఏసీ
- టికెట్ కోసం తొలి దరఖాస్తు సమర్పించిన పవన్
- ప్రజారాజ్యం అనుభవాల దృష్ట్యా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచన
పార్టీపట్ల నిబద్ధత, కష్టపడే తత్వం ఆధారంగా అభ్యర్థిత్వాలు ఖరారు చేయాలని చెప్పిన పవన్.. తన బయోడేటాను కూడా వడపోత కమిటీకి సమర్పించి పార్టీ టికెట్ అభ్యర్థించడం విశేషం. ప్రజారాజ్యం పార్టీ విషయంలో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఎక్కడా డబ్బు ప్రస్తావన రాకుండా చూసుకోవాలని కమిటీకి పవన్ సూచించారు. టికెట్ అభ్యర్థించే వారు ఐదుగురు సభ్యుల కమిటీకి తప్ప మరెవరికీ దరఖాస్తులు సమర్పించవద్దని కోరారు.