ఎక్కడికక్కడ నిలిచిన ఇండిగో విమానాలు... ప్రయాణికుల గగ్గోలు!
- 30 విమాన సర్వీసులు రద్దు
- వాతావరణం అనుకూలంగా లేదన్న సంస్థ
- సిబ్బంది కొరత అంటున్న మరో కథనం
వాస్తవానికి పైలట్లు ఏడాదికి వెయ్యి గంటలు మాత్రమే విమానాలను నడపాల్సివుంటుంది. ఇండిగో పైలట్లంతా దాన్ని అధిగమించారని తెలుస్తోంది. కాగా, పలు నగరాల్లో మంచు దట్టంగా కురుస్తూ ఉండటం, వాతావరణం అనుకూలించని కారణంగా 30 సర్వీసులు నిలిపివేశామని సంస్థ తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. మరో 11 విమానాల దారి మళ్లించామని తెలిపింది. విమాన సర్వీసుల రద్దుతో గమ్యస్థానాలకు చేరే మార్గం లేక వేలాది మంది ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. వీరికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలిస్తున్నట్టు ఇండిగో వెల్లడించింది.