పులికి శిక్షణనిచ్చి నిమిషాల్లో నిద్రపుచ్చగల టాలెంట్ ఆమెది: కాబోయే శ్రీమతిపై విశాల్ ప్రశంసలు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

పులికి శిక్షణనిచ్చి నిమిషాల్లో నిద్రపుచ్చగల టాలెంట్ ఆమెది: కాబోయే శ్రీమతిపై విశాల్ ప్రశంసలు

  • అనీశాతో పరిచయం పెళ్లికి దారితీస్తుందనుకోలేదు
  • దేవుడే నాకోసం ఆమెను పంపించాడు
  • అనీశా జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణి
ఇటీవల ఒక్కసారిగా ప్రముఖ నటుడు విశాల్ ప్రేమ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. త్వరలో తన ప్రేయసి అనీశాను వివాహం చేసుకోబోతున్నట్టు విశాల్ ఈమధ్య ప్రకటించి అందర్నీ సర్ ప్రైజ్ చేశాడు. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విశాల్ తనకు కాబోయే భార్య గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. అనీశాతో పరిచయం పెళ్లికి దారితీస్తుందనుకోలేదని.. తనే ముందు ప్రపోజ్ చేశానని వెల్లడించాడు. మొత్తంగా ఆమెను దేవుడే తనకోసం పంపించాడని విశాల్ చెప్పుకొచ్చాడు. ఓ పులికి శిక్షణ ఇచ్చి దాన్ని నిమిషాల్లో నిద్రపుచ్చగల టాలెంట్ ఆమెకు ఉందని.. అలా నిద్రపుచ్చుతున్న వీడియోను తాను చూసి సర్‌ప్రైజ్ అయ్యానని తెలిపాడు.

తాను వీధి శునకాల ఇతివృత్తంతో ఓ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నానని.. ఆ సినిమా స్క్రిప్టును అనీశాకు చదివి వినిపించానని అన్నాడు. హాలీవుడ్ హంగులతో దానిని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నామని విశాల్ పేర్కొన్నాడు. ఈ సినిమా కోసం పనిచేస్తున్న క్రియేటివ్ బృందంలో అనీశా ఒకరని.. ఆమెను ఫీడ్‌బ్యాక్ కోరినట్టు తెలిపాడు. అనీశా జాతీయ స్థాయి బాస్కెట్ బాల్ క్రీడాకారిణి.. అలాగే సోషల్ వర్కర్ కూడా అని విశాల్ పేర్కొన్నాడు. పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలా? వద్దా? అనేది ఆమె ఇష్టమని తెలిపాడు. మార్చి నెల మొదటి వారంలో విశాల్, అనీశాల నిశ్చితార్థం హైదరాబాద్‌లో వైభవంగా జరగనుంది.
Vishal
Aneesha
Direction
Hyderabad
Engagement

More Telugu News