దూకుడు పెంచుతున్న పవన్.. మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్‌కు కీలక పదవి
- వివిధ కమిటీల నియామకంలో పవన్ బిజీ
- సివిల్స్‌కు సెలక్ట్ అయినప్పుడు కూడా ఇంత ఆనందంగా లేనన్న చంద్రశేఖర్
- పవన్ ముఖంలో అలసటే కనిపించదని ప్రశంసలు
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 1987లో సివిల్స్‌కు సెలక్ట్ అయినప్పటి కంటే ఇప్పుడే చాలా ఆనందంగా ఉందని అన్నారు. పవన్ రోజూ రాత్రి రెండుమూడు గంటల వరకు పనిచేస్తుంటారని, అయినా ఆయన ముఖంలో ఎటువంటి అలసట కనిపించడం లేదని, తాము మాత్రం ఊరికనే అలసిపోతున్నామని అన్నారు. కాగా, సీనియర్ జర్నలిస్ట్ పి.హరిప్రసాద్‌ను పవన్ రాజకీయ కార్యదర్శిగా ఎంపిక చేశారు. జనసేన 'ప్రెసిడెంట్స్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రాం' చైర్మన్‌గా రాధా మాధవ్ నియమితులయ్యారు.