Mammutti: అదే జగనన్న గుండె ధైర్యం: 'యాత్ర' దర్శకుడు మహీ వీ రాఘవ

షార్ట్స్‌లో చూడండి
మమ్ముట్టి హీరోగా తయారైన 'యాత్ర' చిత్రం వైఎస్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులందరికీ నచ్చుతుందని దర్శకుడు మహీ వీ రాఘవ వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో గత రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగగా, ఆయన పాల్గొని ప్రసంగించారు.

 "సినిమా షూటింగ్ పూర్తయిన తరువాత జగనన్నకు ట్రైలర్ చూపిస్తే బాగుందని అభినందించారు. సినిమా పూర్తయింది... ఓసారి చూస్తారా? అని అడిగాను. మీ నాయకుని కథ మీరు చెప్పారు... నేను చూసి ఏం చెప్పేది? అన్నారాయన. ఇక్కడ మీ నాయకుని కథ అన్నారే తప్ప, మా నాన్న కథ అనలేదు. ఆ మాట చెప్పడానికి ఎంతో గుండె ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉన్న వ్యక్తి జగనన్న" అని వ్యాఖ్యానించారు.

ఈ సినిమా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికీ ఓ స్ఫూర్తిని కలిగిస్తుందని నమ్ముతున్నానని ఫంక్షన్ కు అతిథిగా వచ్చిన హీరో సుధీర్ బాబు వ్యాఖ్యానించారు.
Go Back to Shorts
Mammutti
Yatra
Mahi V Raghava
Jagan

More Telugu News