మళ్లీ అదే మాట.. పవన్ ఎవరో తనకు తెలియదన్న అశోక్‌గజపతి రాజు!
- ఎన్టీఆర్ ఎ బయోపిక్ పుస్తకావిష్కరణ
- చిరంజీవి, ఆయన తండ్రి తనకు తెలుసన్న అశోక్ గజపతి
- సినిమాలు చూడను కాబట్టి పవన్ తెలియదని వ్యాఖ్య
తాను సినిమాలు చూడనని, కాబట్టి పవన్ కల్యాణ్ ఎవరో తనకు తెలియదని అన్నారు. ఆయన అన్న చిరంజీవి మాత్రం తనకు తెలుసన్నారు. వాళ్ల తండ్రి కూడా తనకు తెలుసని అశోక్ గజపతి పేర్కొన్నారు. ఎక్సైజ్ శాఖలో పనిచేస్తున్నప్పుడు పవన్ తండ్రి ఓ సారి తనను కలిస్తే పనిచేసి పెట్టానని గుర్తు చేసుకున్నారు.
గతంలోనూ అశోక్ గజపతి రాజు ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం సృష్టించాయి. స్వయంగా పవన్ స్పందించి తానెవరో తెలియకుండానే గెలిచారా? అని ప్రశ్నించారు. త్వరలోనే విజయనగరం వచ్చి పరిచయం చేసుకుంటానని ఎద్దేవా చేశారు.