సినీ నటి భానుప్రియ ఇంటి నుంచి పనిపిల్లను తీసుకెళ్లిన అధికారులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినీ నటి భానుప్రియ ఇంటి నుంచి పనిపిల్లను తీసుకెళ్లిన అధికారులు

  • భానుప్రియపై సామర్లకోటలో కేసు నమోదు
  • తనపై వచ్చిన ఆరోపణలను ఖండించిన నటి
  • అధికారులు ఇంటికొచ్చి బాలికను తీసుకెళ్లారన్న భానుప్రియ
బాలికతో పనిచేయించుకోవడమే కాకుండా ఆమెను లైంగికంగా వేధిస్తున్నారన్న వార్తలతో  నటి భానుప్రియ ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కింది. తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట సమీపంలోని సండ్రవారి గ్రామానికి చెందిన ప్రభావతి తన కుమార్తెను భానుప్రియ ఇంట్లో పనిమనిషిగా పెట్టింది.

ఇటీవల ప్రభావతి సామర్లకోట పోలీసులకు ఫిర్యాదు చేస్తూ.. ఏడాది కాలంగా తన కుమార్తెను చూడనీయడం లేదని, శారీరకంగా హింసిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాదు, భానుప్రియ సోదరుడు గోపీకృష్ణ తన కుమార్తెను లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపించింది.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం చెన్నై వచ్చి విచారించారు. కాగా, తనపై వచ్చిన ఆరోపణలను నటి భానుప్రియ ఖండించింది. బాలిక తన ఇంట్లో విలువైన వస్తువులను దొంగిలించిందని ఆరోపించింది. తాము భయపెట్టడంతో కొన్ని వస్తువులను తిరిగి ఇచ్చిందని, మరికొన్ని ఇవ్వాల్సి ఉందని తెలిపింది.

పోలీసులకు ఫిర్యాదు చేస్తాననడంతో ఆమె తల్లి ప్రభావతి ఏడుస్తూ కేసు పెట్టవద్దని కోరిందని భానుప్రియ పేర్కొంది. శుక్రవారమే తన ఇంటికి వచ్చిన పిల్లల సంరక్షణ విభాగం అధికారులు బాలికను తీసుకెళ్లారని వివరించింది. దీంతో పనిమనిషి కథ సుఖాంతమైంది.
Bhanu priya
Actress
Chennai
Samlkot
East Godavari District

More Telugu News