కేన్ విలియమ్సన్ ఒంటరి పోరు... ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో న్యూజిలాండ్!
- నేపియర్ లో జరుగుతున్న తొలి వన్డే
- రాణించిన విలియమ్సన్
- న్యూజిలాండ్ స్కోరు 146/6
ఈ క్రమంలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. అతనికి అండగా నిలుస్తాడనుకున్న టేలర్ 24, లాథమ్ 11 పరుగులకు, నికోల్స్ 12 పరుగులకు, శాంట్ నర్ 14 పరుగులకు పెవిలియన్ చేరారు. భారత బౌలర్లలో షమీకి 3 వికెట్లు, చాహాల్ కు 2, కేఎం జాదవ్ కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం న్యూజిలాండ్ స్కోరు 33 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 146 పరుగులు. విలియమ్సన్ 64 పరుగులతో ఉన్నాడు. సౌదీ, ఫెర్గ్యూసన్, బౌల్ట్ లు బ్యాటింగ్ కు దిగాల్సివుంది.