నా దృష్టి సినిమాల మీదే.. రాజకీయ ప్రవేశంపై వార్తలను ఖండించిన నటి కరీనా కపూర్
- భోపాల్ నుంచి లోక్‌సభకు కరీనా
- కాంగ్రెస్ అభ్యర్థి అంటూ ప్రచారం
- రాజకీయాలపై ఆసక్తి లేదన్న బాలీవుడ్ నటి
భోపాల్‌లో బీజేపీని ఓడించడానికి కరీనా కపూరే సరైన వ్యక్తి అని పేర్కొంటూ కార్పొరేటర్ యోగేంద్ర సింగ్ చౌహాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి లేఖ రాసినట్టు వార్తలు బయటకు వచ్చాయి. అంతేకాదు, ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌తో కూడా ఈ విషయమై చర్చించేందుకు ఆయన రెడీ అవుతున్నట్టు కథనాలు వెలువడ్డాయి. దీంతో స్పందించిన కరీనా ఆ వార్తలను ఖండించింది. రాజకీయాలపై తనకు ఆసక్తి లేదని తేల్చి చెప్పింది. ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని కరీనా పేర్కొంది.