చిరంజీవి క్లాప్ తో మొదలైన వైష్ణవ్ తేజ్ సినిమా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి క్లాప్ తో మొదలైన వైష్ణవ్ తేజ్ సినిమా

  • వైష్ణవ్ తేజ్ హీరోగా సెట్స్ పైకి 
  • పూజా కార్యక్రమాలకి చిరు .. నాగబాబు
  • త్వరలోనే మిగతా వివరాలు    
చిరంజీవి మేనల్లుడిగా సాయిధరమ్ తేజ్ కొంతకాలం క్రితం తెలుగు తెరకి హీరోగా పరిచయమయ్యాడు. తొలి రెండు .. మూడు సినిమాలతోనే మాస్ హీరోగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. పాత సినిమాల్లో చిరంజీవి మాదిరిగానే ఉన్నాడనే కితాబును అందుకున్నాడు. ఆయన సోదరుడు వైష్ణవ తేజ్ కూడా నటనవైపే మొగ్గు చూపాడు.ఆయన హీరోగా ఒక సినిమాను రూపొందించడానికి దర్శకుడు బుచ్చిబాబు రంగంలోకి దిగాడు. సుకుమార్ .. మైత్రీ మూవీ మేకర్స్ వారు సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమా, కొంతసేపటి క్రితమే పూజా కార్యక్రమాలను జరుపుకుంది. చిరంజీవి క్లాప్ కొట్టడంతో తొలి షాట్ ను నాయకా నాయికలపై చిత్రీకరించారు. కథానాయకుడిగా వైష్ణవ్ తేజ్ ఎదగాలని చిరంజీవి .. నాగబాబు మేనమామలుగా తమ ఆశీస్సులు అందజేశారు. ఇంకా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేయలేదు. త్వరలోనే ఈ ప్రాజెక్టుకి సంబంధించిన మిగతా వివరాలు తెలియనున్నాయి.
vaishnav tej

More Telugu News