క్యాస్టింగ్ కౌచ్ అసలు లేదని అనను: కాజల్ అగర్వాల్
- నాకు ఎలాంటి చేదు అనుభవాలూ ఎదురుకాలేదు
- మహిళలు హాయిగా పనిచేసుకునే వాతావరణం కావాలి
- కెరీర్ పై ఆందోళనతోనే తమ బాధలను దాస్తున్నారన్న కాజల్
విషయం బయటకు చెబితే అవకాశాలు రావన్న భయంతోనే చాలామంది బయటకు రావడం లేదని, కెరీర్ పై ఆందోళనతోనే తమ అనుభవాలను ఎన్నో ఏళ్లు దాచిపెడుతున్నారని, ఇప్పుడు అవకాశం వచ్చి బయట పెడుతున్నారని అభిప్రాయపడింది. తన కెరీర్ ఆరంభం నుంచి ఎంతో కాలం పాటు తన తల్లి తనతోనే ఉందని, అందువల్లే తనను ఎవరూ ఇబ్బందులు పెట్టలేదని చెప్పింది. మహిళలు హాయిగా పని చేసుకునే వాతావరణం అన్ని రంగాల్లోనూ ఉండాలని కోరుకుంటున్నానని కాజల్ తెలిపింది.