వాంతి చేసుకుందామని బస్సు కిటికీ నుంచి వంగింది.. తల తెగి పడింది!
- పన్నా జిల్లాకు బయలుదేరిన ఆశారాణి
- కడుపులో తిప్పడంతో బయటకు వంగింది
- విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన తల
- బస్సు వేగమే ఘటనకు కారణం
మార్గమధ్యంలో ఆమెకు కడుపులో తిప్పినట్టుగా అనిపించడంతో వాంతి చేసుకునేందుకు కిటికీ నుంచి బయటకు వంగింది. దీంతో ఆశారాణి తల విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఆ సమయంలో బస్సు వేగంగా ప్రయాణిస్తుండటంతో ఆమె తల తెగి పడింది. దీంతో బస్సులోని ప్రయాణికులంతా భయాందోళనలకు గురయ్యారు. పోస్టుమార్టం అనంతరం మహిళ మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. బస్సు డ్రైవర్ను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.