వంటేరు వస్తానన్నా మేం చేర్చుకోవాలిగా?: టీఆర్ఎస్ నేత కొత్త ప్రభాకర్ రెడ్డి
- 2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ చేతిలో ఓటమి
- నేడు టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు వార్తలు
- ఖండించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
ఇటీవల తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై గజ్వేల్లో పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఓటమి పాలయ్యారు. 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున కేసీఆర్పైనే పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా, ఆయన టీఆర్ఎస్లో చేరబోతున్నట్టు గురువారం సాయంత్రం ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. నేటి సాయంత్రం కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది.