ఐదో రోజున అత్యధిక వసూళ్లను రాబట్టిన 'ఎఫ్ 2'
- ఈ నెల 12న వచ్చిన 'ఎఫ్ 2'
- అయిదు రోజుల్లో 32 కోట్ల షేర్
- ఈ వీకెండ్ లోను అదే జోరు
తొలి నాలుగు రోజుల కంటే ఎక్కువ వసూళ్లను 5వ రోజున ఈ సినిమా రాబట్టడం విశేషం. తొలి 4 రోజుల్లో 26 కోట్ల షేర్ ను సాధించిన ఈ సినిమా, 5వ రోజున 6.5 కోట్ల షేర్ ను వసూలు చేసింది. దాంతో 5 రోజుల్లో ఈ సినిమా 32 కోట్లకి పైగా షేర్ ను రాబట్టింది. ఇక ఈ వారాంతంలో కొత్తగా వచ్చే సినిమాలేవీ లేవు. అందువలన ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా 60 కోట్ల షేర్ మార్కును అందుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.