'దటీజ్ మహాలక్ష్మి' నుంచి లిరికల్ వీడియో
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'దటీజ్ మహాలక్ష్మి' నుంచి లిరికల్ వీడియో

  • హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్'
  • తెలుగు రీమేక్ గా 'దటీజ్ మహాలక్ష్మి'
  • ఆకట్టుకుంటోన్న లిరికల్ వీడియో        
తమన్నా ప్రధాన పాత్రధారిగా 'దటీజ్ మహాలక్ష్మి' సినిమా నిర్మితమవుతోంది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా నుంచి తాజాగా ఒక లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. "అరె చిన్నా పెద్దా చుట్టూ చేరే .. చిందులాడి చూపే జోరే .. పెళ్లిగోల షురూ కారే .. పిల్లగాడు తెల్ల దొరే .. పల్లకిలో వచ్చేస్తాడే .. లండనంతా రాసిస్తాడే .. " అంటూ ఈ పాట కొనసాగుతోంది.

'మహాలక్ష్మి'కి సంబంధించిన పెళ్లి ఏర్పాట్లకి సంబంధించిన విజువల్స్ తో ఈ లిరికల్ వీడియోను కట్ చేశారు. సందడిగా .. సంబరంగా కొనసాగే ఈ పాటకి సంగీత దర్శకుడు అమిత్ త్రివేది బాణీ కట్టగా, గీతామాధురి ఆలపించింది. సాహిత్యాన్ని కృష్ణకాంత్ అందించాడు. గతంలో హిందీలో హిట్ కొట్టిన 'క్వీన్' సినిమాకి ఇది రీమేక్. ఆ సినిమా మాదిరిగానే ఈ సినిమా కూడా ఘన విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి.  
tamannah

More Telugu News