పెళ్లికి ముందు నేనంటే ప్రసన్నకి కోపంగా ఉండేది: హీరోయిన్ స్నేహ

  • ప్రసన్నతో చేయనని చెప్పాను
  • ఆయన చాలా అప్సెట్ అయ్యారట
  • నాపై కోపంతోనే వున్నారు
సుహాసిని .. సౌందర్య తరహాలో తెలుగు ప్రేక్షకుల మనసులను దోచుకున్న కథానాయికగా స్నేహ కనిపిస్తుంది. అలాంటి స్నేహ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో మాట్లాడుతూ, తన భర్త ప్రసన్నను గురించి ప్రస్తావించింది. "పెళ్లికి ముందు .. కొంతకాలం క్రితం నేను .. ప్రసన్న ఒక సినిమా చేయవలసి వుంది. అది హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా. అప్పుడు ప్రసన్న అయితే నేను ఆ సినిమా చేయను అని చెప్పానట .. అది నాకు జ్ఞాపకం కూడా లేదు.

ఈ విషయం తెలిసి ఆయన చాలా హర్ట్ అయ్యారట. 'ఎందుకు నా విషయంలో స్నేహ అలా మాట్లాడింది' అని చాలా అప్సెట్ అయ్యారట. అయితే ఈ విషయం తెలియని నేను, ఇళయరాజా కలెక్షన్ కోసం ప్రసన్నకి ఫోన్ చేశాను. అప్పుడు ఆయన చాలా ముభావంగా మాట్లాడటం నన్ను ఆలోచనలో పడేసింది. ఆ తరువాత ఇద్దరం కలిసి ఓ తమిళ సినిమా చేశాము. ఆ సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆయన నాతో మాట్లాడేవారు కాదు. నేనేంటో అర్థమయ్యాక .. ఆయనే ప్రపోజ్ చేశారు" అని చెప్పుకొచ్చారు.
Go Back to Shorts
sneha
prasanna

More Telugu News