Chandrababu: ‘ఎన్టీఆర్’లో మీ పాత్ర ఎలా అనిపించిందన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఇదీ!

షార్ట్స్‌లో చూడండి
ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఆయన తనయుడు బాలకృష్ణ నటించి, నిర్మించిన చిత్రం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’. బుధవారం విడుదలైన ఈ సినిమాను ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి విజయవాడలోని క్యాపిటల్ సినిమాస్‌లో బాలకృష్ణ, క్రిష్, మంత్రులు దేవినేని ఉమ, కొల్లు రవీంద్ర, విప్ బుద్దా వెంకన్న, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య తదితరులతో కలిసి వీక్షించారు.

సినిమా చాలా అద్భుతంగా ఉందని, పాత రోజులన్నీ గుర్తుకొస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన ఎన్నో విలువైన విషయాలను ఇందులో చూపించారని, ఈ సినిమా అందరికీ స్ఫూర్తినిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరు తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు.

‘ఎన్టీఆర్’ సినిమాలో తన పాత్రపై విలేకరులు అడిగిన ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. ‘నా పాత్ర ఎలా ఉందన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు’ అని పేర్కొన్నారు. నటీనటులందరూ తమ పాత్రల్లో జీవించారని ప్రశంసించారు. సినిమాను క్రిష్ అద్భుతంగా తీశారని,  బాలకృష్ణ బాగా నటించారని కొనియాడారు.  
Go Back to Shorts
Chandrababu
NTR kathanayakudu
Balakrishna
Krish
Andhra Pradesh

More Telugu News