renu desai: తల్లి పాత్ర కోసం అడిగితే.. ఆరోగ్యం బాగాలేదని చెప్పిన రేణు దేశాయ్!

షార్ట్స్‌లో చూడండి
తెలుగు తెరపై ఇటు హీరోకి .. అటు హీరోయిన్ కి తల్లి పాత్రల కోసం సీనియర్ హీరోయిన్స్ ను రంగంలోకి దింపడం త్రివిక్రమ్ సినిమాల నుంచి మొదలైంది. ఫలితంగా నదియా .. ఖుష్బూ .. తులసి .. ప్రగతి .. శరణ్య వంటివారు వరుస అవకాశాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో కొత్తగా ఉండాలనే ఉద్దేశంతో .. తన సినిమాలో తల్లి పాత్రను చేయమని ఇటీవల ఒక నిర్మాత రేణు దేశాయ్ ని అడిగాడట.

తల్లి పాత్రను ఆమె చేయడం వలన, ఈ సినిమాపై క్రేజ్ మరింత పెరుగుతుందని అన్నాడట. అయితే అందుకు రేణు దేశాయ్ పెద్దగా ఆసక్తిని చూపలేదని సమాచారం. తన ఆరోగ్యం బాగుండలేదనీ, అందువలన చేయలేనని చెప్పినట్టుగా ఫిల్మ్ నగర్లో ఒక టాక్ వినిపిస్తోంది. తల్లి పాత్రను చేయమని రేణు దేశాయ్ ని అడిగిన నిర్మాత, ఆమెకి బాగా పరిచయమున్నవాడేనట. అందువలన రేణు దేశాయ్ చెప్పింది నిజమే అయ్యుంటుందనే చెప్పుకుంటున్నారు. మొత్తానికి రేణు దేశాయ్ తో రీ ఎంట్రీ ఇప్పించడానికి ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయన్న మాట. 
Go Back to Shorts
renu desai

More Telugu News