ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ. 2 వేల కోట్లు అవసరమని చెబుతున్నారు: పవన్ కల్యాణ్

షార్ట్స్‌లో చూడండి
త్వరలో జరగనున్న ఎన్నికల్లో పోటీ చేయాలంటే రూ. 2 వేల కోట్లు అవసరమవుతాయని చాలా మంది తనతో చెప్పారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఇప్పటికే అధికార, ప్రతిపక్షాలు అందుకు సన్నద్ధంగా ఉన్నాయని తనకు తెలిసిందని చెప్పారు. రాజకీయాలను నడపడానికి డబ్బు అవసరం లేదని... అదే విషయాన్ని బీఎస్పీ వ్యవస్థాపకులు కాన్షీరాం రుజువు చేశారని తెలిపారు. తనకు కాన్షీరామే మార్గదర్శి అని చెప్పారు.

సినిమాలు తనకు సంతృప్తిని ఇవ్వలేకపోయాయని... నిజమైన సంతృప్తి ప్రజా సమస్యల పరిష్కారంలోనే లభిస్తుందని పవన్ అన్నారు. సినిమాల్లోకి రాకముందే సమాజాన్ని అర్థం చేసుకోవడం ప్రారంభించానని తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఉన్న సమయంలో తాను జనసేనను స్థాపించానని... ఎలాంటి భావజాలం లేని పార్టీలు రాజ్యాలను ఏలుతున్న సమయంలో పార్టీ పెట్టడానికి సమయం ఆసన్నమైందని తనకు అనిపించిందని చెప్పారు.
Go Back to Shorts
Pawan Kalyan
janasena
kanshiram

More Telugu News