chiranjeevi: 'సైరా' కోసం సీమ నేపథ్యంలో విలేజ్ సెట్

షార్ట్స్‌లో చూడండి
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చిరంజీవి 'సైరా' సినిమా చేస్తున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణను పూర్తిచేసుకుంది. రీసెంట్ గా హైదరాబాద్ శివార్లలో ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు.

తదుపరి షెడ్యూల్ కోసం హైదరాబాద్ - రామోజీ ఫిల్మ్ సిటీలో రాయలసీమ వాతావరణం ప్రతిబింబించే ఒక విలేజ్ సెట్ ను సిద్ధం చేస్తున్నారు. 'నరసింహ రెడ్డి గూడెం' పేరుతో ఈ సెట్ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ పర్యవేక్షణలో సెట్ రూపకల్పన జరుగుతున్నట్టుగా చెబుతున్నారు.

ఈ విలేజ్ సెట్ లో ఒక గ్రూప్ సాంగ్ తో పాటు, ప్రధాన పాత్రధారులంతా పాల్గొనే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. విలేజ్ సెట్ నిర్మాణం పూర్తవగానే షూటింగ్ ను మొదలుపెట్టనున్నారు.
Go Back to Shorts
chiranjeevi
nayan

More Telugu News