150 కోట్ల క్లబ్ లోకి దూసుకుపోయిన 'కేజీఎఫ్'
- 80 కోట్లతో రూపొందిన 'కేజీఎఫ్'
- వాస్తవానికి దగ్గరగా నడిచిన కథాకథనాలు
- హిందీ వెర్షన్ వసూళ్లు 26 కోట్లకు పైగా
11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 150 కోట్లను రాబట్టింది. ఈ సినిమాతో యశ్ రేంజ్ పూర్తిగా మారనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ వాస్తవానికి దగ్గరగా ఈ కథను ఆవిష్కరించడం .. ప్రతి పాత్రను సహజత్వంతో మలిచిన తీరు .. యశ్ నటన ఈ సినిమాకి ఈ స్థాయి క్రేజ్ ను తెచ్చిపెట్టాయని అంటున్నారు. శ్రీనిధి శెట్టి కెరియర్ కి ఈ సినిమా ఎంతో హెల్ప్ అవుతుందని చెబుతున్నారు.