పాలమూరు యూనివర్సిటీలో పునుగు పిల్లి.. హైదరాబాద్ జూపార్క్‌కు తరలింపు
- రెండు పిల్లలకు జన్మనిచ్చిన పిల్లి
- శేషాచలం కొండల్లో కనిపించే ఏషియన్ పాలం సీవెట్
- తిరుమల శ్రీవారి సేవలో పునుగుపిల్లి తైలం
మన దేశంలో తిరుపతిలోని శేషాచలం అడవుల్లో ఇది కనిపిస్తుంది. ఈ పిల్లి తైలానికి ఎంతో విశిష్టత ఉంది. చాలా సువాసనతో ఉండే ఈ తైలాన్ని అభిషేకం అనంతరం తిరుమల శ్రీవారికి పూస్తారు. కాగా, పాలమూరు యూనివర్సిటీలో పునుగు పిల్లి ఉందన్న సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారి రాములు వర్సిటీకి చేరుకుని పరిశీలించారు. వాటిని హైదరాబాద్ జూపార్క్‌కు తరలించనున్నట్టు తెలిపారు.