త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఖరారు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ మూవీ ఖరారు

  • గీత ఆర్ట్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ 
  • బన్నీతో 3వ సినిమా
  • త్వరలోనే సెట్స్ పైకి
అల్లు అర్జున్ తదుపరి సినిమా ఏ దర్శకుడితో ఉంటుందా అనే ఆసక్తితో ఆయన అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. ఆయన తదుపరి సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ తోనే వుండనుందనేది తాజాగా ఖరారైపోయింది. 'నా పేరు సూర్య' పరాజయం తరువాత అల్లు అర్జున్ ఆలోచనలో పడ్డాడు. ఈ సారి తప్పకుండా సరైన హిట్ కొట్టాలని ఆయన భావించాడు. అలాంటి హిట్ ను తనకి త్రివిక్రమ్ అందించగలరనే నమ్మకం పెట్టుకున్నాడు. అందుకోసమే త్రివిక్రమ్ ఫ్రీ అయ్యేంతవరకూ వెయిట్ చేశాడు. ఈలోగా విక్రమ్ కుమార్ తో కలిసి సెట్స్ పైకి వెళతాడనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. చివరికి సంకల్ప్ రెడ్డి పేరు కూడా వినిపించింది. ఈ ప్రచారానికి తెరదించుతూ అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ తోనే చేయనున్నాడనే విషయం అధికారికంగా బయటికి వచ్చింది. గీత ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా నిర్మితం కానుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ వారు కూడా నిర్మాణంలో భాగస్వాములు కానున్నారు. జనవరిలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది త్రివిక్రమ్ .. అల్లు అర్జున్ కాంబినేషన్లో రూపొందుతోన్న 3వ చిత్రం కావడం విశేషం. 
trivikram
allu arjun

More Telugu News