బుక్స్ చదవడమంటే నాకు చాలా ఇష్టం: రేణు దేశాయ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బుక్స్ చదవడమంటే నాకు చాలా ఇష్టం: రేణు దేశాయ్

  • పుస్తకాలంటే నాకు ప్రాణం 
  • ప్రతిరోజు పుస్తకాలు చదువుతాను 
  • అందువల్లనే భాషపై పట్టు పెరిగింది  
నటిగా .. దర్శక నిర్మాతగా రేణు దేశాయ్ కి మంచి గుర్తింపు వుంది. తనకి కవిత్వమంటే చాలా ఇష్టమని గతంలో ఆమె చాలాసార్లు ఇంటర్వ్యూల్లో చెప్పారు. తాను రాసిన కవితల్లో నుంచి కొన్నిటిని తీసుకుని వాటికి ఆమె పుస్తక రూపాన్ని తీసుకొచ్చారు. ఆ కవితా సంపుటికి ఆమె 'ఎ లవ్ అన్ కండిషినల్' అనే పేరు పెట్టారు. తాజా ఇంటర్యూలో ఆమె ఈ పుస్తకాన్ని గురించి మాట్లాడారు.

"చిన్నప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడమంటే చాలా ఇష్టం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రాణం. పుస్తకాలు చదువుతూ వుండటం వలన మనకి తెలియకుండానే భాషపై పట్టు ఏర్పడుతుంది. ఏదైనా రాయాలనుకున్నప్పుడు పదాలను గురించి వెతుక్కోవలసిన అవసరం ఉండదు. ప్రతి రోజు ఏదో ఒక పుస్తకం చదువుతూనే వుంటాను. ఈ పేజీ తరువాత ఆపేద్దాం .. ఈ చాప్టర్ తరువాత ఆపేద్దాం అనుకుంటూనే తెల్లవారు జామువరకూ చదువుతూనే వుంటాను" అని చెప్పుకొచ్చారు. 
renu desai

More Telugu News