Telangana: ప్రియురాలి కోసం పరారైన పెళ్లికొడుకు.. వధువు మెడలో తాళికట్టిన మరో యువకుడు!

అచ్చం సినిమాకు ఏమాత్రం తీసుపోని ఘటన ఇది. సరిగ్గా వివాహానికి ముందు పెళ్లి కొడుకు పరారవగా, అక్కడే ఉన్న మరో యువకుడు ముందుకు వచ్చి వధువు మెడలో తాళి కట్టాడు. దీంతో మొత్తం కథ సుఖాంతమయింది. ఈ ఘటన తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది.

జిల్లాలోని పొట్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని చిగురుమామిడి మండలం చినముల్కనూర్‌కు చెందిన పందిపెల్లికి చెందిన ఆమె బావ శ్రీనివాస్ కు ఇచ్చి వివాహం చేసేందుకు ఇరుకుటుంబాల పెద్దలు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మరో యువతిని ప్రేమించిన శ్రీనివాస్.. నిన్న ఉదయం 11 గంటలకు వివాహ మండపం వద్దకు వస్తున్న క్రమంలో చల్లగా జరుకున్నాడు. తీరా పెళ్లి సమయానికి శ్రీనివాస్ కనిపించకపోవడంతో అక్కడ కలకలం చెలరేగింది.

మరోవైపు పెళ్లి  కూతురిని తొలుత రమేశ్ అనే యువకుడికి ఇచ్చి వివాహం చేయాలని అమ్మాయి కుటుంబ సభ్యులు అనుకున్నారు. అయితే శ్రీనివాస్ తల్లి మేనకోడలు తన కోడలిగానే రావాలని పట్టుపట్టడంతో అందుకు అంగీకరించారు. చివరికి శ్రీనివాస్ పెళ్లికే రాకుండా పారిపోవడంతో అక్కడే ఉన్న రమేశ్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసేశాడు. దీంతో మొత్తం కథ సుఖాంతమయింది.
Telangana
Siddipet District
marriage
movie style

More Telugu News