తెలంగాణలో పరువు హత్య.. బావను తలపై బండరాయితో కొట్టిచంపిన బావమరిది!
Add ap7am to your home Screen

తెలంగాణలో పరువు హత్య.. బావను తలపై బండరాయితో కొట్టిచంపిన బావమరిది!

  • హైదరాబాద్ లోని తిరుమలగిరిలో ఘటన
  • మూడేళ్ల క్రితం నందకిశోర్-అశ్విని వివాహం
  • కేసు నమోదు చేసిన పోలీసులు
ఓ యువతి కులాంతర వివాహం చేసుకోవడం ఇష్టంలేని ఆమె కుటుంబ సభ్యులు రెచ్చిపోయారు. అల్లుడిని ఇంటికి పిలిపించి పూటుగా మద్యం తాగించారు. అనంతరం పక్కా ప్రణాళికతో అతని తలపై బండరాయితో మోది హత్యచేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

నగరంలోని తిరుమలగిరి ప్రాంతానికి చెందిన అశ్విని అనే యువతిని నందకిశోర్ అనే యువకుడు మూడేళ్ల క్రితం ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే వీరిది కులాంతర వివాహం కావడంతో అమ్మాయి తల్లిదండ్రులు తొలుత పెళ్లికి అంగీకరించలేదు. అయినా ఎదిరించి పెళ్లి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నందకిశోర్ ను వదిలి వచ్చేయాలనీ, మళ్లీ వివాహం చేస్తామని అశ్వినికి ఆమె తల్లిదండ్రులు ఫోన్ లో చెప్పేవారు. ఈ జంటకు ఓ బాబు కూడా ఉన్నాడు. ఈ క్రమంలో కొన్నిరోజుల క్రితం భార్యభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి.

దీంతో బాబును తీసుకుని అశ్విని పుట్టింటికి వచ్చేసింది. ఈ నేపథ్యంలో పంచాయితీ కోసం రావాలని, మాట్లాడుకుందామని నందకిశోర్ ను అశ్విని కుటుంబ సభ్యులు పిలిపించారు. ఈ సందర్భంగా నందకిశోర్ తో ఊరిబయట పూటుగా మద్యం తాగించిన బావమరిది మహేశ్వర్, అతని తలపై బండరాయితో మోది హత్యచేశాడు. కాగా, ఈ వ్యవహారంలో అశ్విని సోదరుడు మహేశ్వర్ తో పాటు ఇంకొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ వ్యవహారంలో అశ్వినిని పోలీసులు విచారిస్తున్నారు.
Telangana
honour killing
tirumala giri
Police

More Telugu News