భారీ వసూళ్లతో దూసుకుపోతోన్న 'కేజీఎఫ్'
- యశ్ హీరోగా రూపొందిన 'కేజీఎఫ్'
- పెరుగుతోన్న వసూళ్ల జోరు
- ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లు
ఇక హిందీలో ఇదే రోజున షారుక్ 'జీరో' సినిమా విడుదలైంది. అయినా ఈ రెండు భాషల్లోని గట్టి పోటీని తట్టుకుని ఈ సినిమా నిలబడింది. షారుక్ 'జీరో'నాలుగు రోజుల్లో 69 కోట్లు వసూలు చేస్తే, 'కేజీఎఫ్' నాలుగు రోజుల్లో 75 కోట్లు రాబట్టడం విశేషం. ఇక తెలుగులో ఈ సినిమా హక్కులను 5 కోట్లకి సాయి కొర్రపాటి కొనుగోలు చేయగా, ఇప్పటికే 6 కోట్లకి పైగా షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 100 కోట్లకి పైగా వసూళ్లను సాధించిన ఈ సినిమా, తన జోరును మరింత పెంచుతుండటం విశేషం.