జగన్ నాడు వైఎస్సార్ పేరును.. నేడు కులాన్ని వాడుకుంటున్నారు: జేసీ
Add ap7am to your home Screen

జగన్ నాడు వైఎస్సార్ పేరును.. నేడు కులాన్ని వాడుకుంటున్నారు: జేసీ

  • పవన్ కుల రాజకీయాలు చేస్తున్నారు
  • ఏపీకి ఏమిచ్చారని పర్యటిస్తారు?
  • కక్ష సాధింపు ధోరణితోనే ఏపీ పర్యటన
గత ఎన్నికల్లో వైఎస్సార్ పేరును వాడి పబ్బం గడుపుకున్న వైసీపీ అధినేత జగన్.. ఇప్పుడు కులాన్ని వాడుకుంటున్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విమర్శించారు. ఢిల్లీలో జేసీ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా కుల రాజకీయాలు చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు.

ప్రధానిగా మోదీకి దేశం మొత్తం పర్యటించే స్వేచ్ఛ ఉందని.. కానీ ఏపీకి ఏమిచ్చారని పర్యటిస్తారని ఆయన ప్రశ్నించారు. కక్ష సాధింపు ధోరణితోనే ప్రధాని ఏపీకి వస్తున్నారని జేసీ పేర్కొన్నారు. ఏపీ కోరిన వాటన్నింటికీ మొండి చెయ్యి చూపించినందుకా రాష్ట్రానికి వచ్చేదంటూ ఎద్దేవా చేశారు. ఏపీలో బీజేపీ పరిస్థితి లాంటిదే కాంగ్రెస్ పరిస్థితి కూడా అని జేసీ వ్యాఖ్యానించారు. 
YSR
Jagan
Pawan Kalyan
Narendra Modi
Andhra Pradesh

More Telugu News