త్రివిక్రమ్ .. బన్నీ సినిమాపై ఫిల్మ్ నగర్ టాక్

  • త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసిన బన్నీ 
  • ఇప్పట్లో లేనట్టేననే ప్రచారం 
  • పరశురామ్ తో ఖాయమంటూ టాక్  
అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. త్రివిక్రమ్ తో సినిమా చేయాలనే ఉద్దేశంతోనే, విక్రమ్ కుమార్ ప్రాజెక్టును అల్లు అర్జున్ పక్కన పెట్టేశాడనే టాక్ కూడా వినిపించింది. త్రివిక్రమ్ తాను సిద్ధం చేసిన స్క్రిప్ట్ ను బన్నీకి వినిపించాడనీ, ఆయన చెప్పిన మార్పులు .. చేర్పులు సరిచేయడంలో త్రివిక్రమ్ బిజీగా వున్నాడని కూడా చెప్పుకున్నారు.

కానీ బన్నీ తాజా చిత్ర దర్శకుడిగా ఇప్పుడు పరశురామ్ పేరు తెరపైకి వచ్చింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఇటీవల పరశురామ్ చేసిన 'గీత గోవిందం' భారీ విజయాన్ని అందుకుంది. ఆయన తదుపరి సినిమా కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ పైనే వుండనున్నట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆయన కథలో హీరో అల్లు అర్జున్ అని అంటున్నారు. ఆయనతో సినిమా చేయడానికి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని చెబుతున్నారు. త్రివిక్రమ్ తో సినిమా ఇప్పట్లో లేనట్టేనని అంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి. 
Go Back to Shorts
allu arjun
trivikram
parashuram

More Telugu News