సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • మరో రెండు చిత్రాలకు ఓకే చెప్పిన త్రిష 
  • '96'ను కన్ఫర్మ్ చేసిన శర్వానంద్
  • మూడేళ్ల తర్వాత వస్తున్న వరుణ్ సందేశ్
*  తాజాగా 'పేట్టా' సినిమాలో రజనీకాంత్ సరసన నటించిన కథానాయిక త్రిష ఇప్పుడు మరో రెండు కొత్త చిత్రాలను అంగీకరించింది. వీటిని 'ఆల్ ఇన్ పిక్చర్స్' సంస్థ నిర్మిస్తుంది. పూర్తి వివరాలు త్వరలో ప్రకటిస్తారు.  
*  తమిళంలో హిట్టయిన '96' చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తాను నటిస్తున్నట్టు హీరో శర్వానంద్ తాజాగా ధ్రువీకరించాడు. తమిళ వెర్షన్ కి దర్శకత్వం వహించిన ప్రేమ కుమార్ దీనికి కూడా దర్శకత్వం వహిస్తాడు.
*  'హ్యాపీ డేస్', 'కొత్త బంగారు లోకం' వంటి చిత్రాల ద్వారా పేరు తెచ్చుకున్న హీరో వరుణ్ సందేశ్ మూడేళ్ల తర్వాత ఇప్పుడు ఓ సినిమాలో నటిస్తున్నాడు. గోకుల్ ఛాట్ పేలుళ్ల ఘటన ఆధారంగా రూపొందుతున్న 'డాడీ' చిత్రంలో వరుణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్నాడు.
Trisha
Rajanikanth
Sharwanand
Varun

More Telugu News