మైదానంలో బూతులు తిట్టుకున్న ఇషాంత్, జడేజా!
- గొడవకు దిగిన టీమిండియా సహచరులు
- ఇషాంత్, జడేజాలను విడదీసిన షమీ, కుల్దీప్
- అనుకోని ఘటనేనన్న బీసీసీఐ
ఏం జరిగిందో ఏమోగానీ, ఇషాంత్, జడేజా ఒకరికి ఒకరు దగ్గరగా దూసుకొచ్చి తీవ్రంగా తిట్టుకున్నారు. స్టంప్స్ కు అమర్చిన మైక్ లో రికార్డయిన వివరాలను బట్టి, ఇద్దరూ హిందీలో బూతులు తిట్టుకున్నారు. వీరిని షమీ, కుల్దీప్ యాదవ్ లు విడదీయాల్సి వచ్చింది. ఈ ఘటనపై వివరణ ఇచ్చిన బీసీసీఐ, ఇది అనుకోకుండా జరిగిన ఘటనేనని, ఆటగాళ్ల మధ్య విభేదాలు ఉన్నాయని భావించాల్సిన అవసరం లేదని స్పష్టం చేయడం గమనార్హం.