వరుసగా రెండు వికెట్లు తీసిన షమీ... ఆరు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

  • భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆస్ట్రేలియాకు బ్రేక్
  • ఫైనీ, ఖావాజా వికెట్లు తీసిన మహమ్మద్ షమీ
  • ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 192/6
పెర్త్ లో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారీ స్కోరు దిశగా సాగుతున్న ఆసీస్ ను తీవ్రమైన దెబ్బకొట్టాడు మహమ్మద్ షమీ. ఈ ఉదయం నాలుగో రోజు ఆట ప్రారంభమైన తరువాత పైనీ, ఫించ్ ఆచితూచి ఆడుతూ స్కోరును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో లంచ్ విరామం వరకూ భారత బౌలర్లు ఒక్క వికెట్ ను కూడా తీయలేకపోయారు.

లంచ్ తరువాత రెండో ఓవర్ లోనే పరిస్థితి మారిపోయింది. 79వ ఓవర్ ను వేసిన షమీ, తన ఐదో బంతిలో పైనీని, ఆరో బంతిలో ఫించ్ ని అవుట్ చేశాడు. షమీ వేసిన బంతిని పైనీ ఆడగా, దాన్ని కోహ్లీ క్యాచ్ పట్టాడు. తరువాతి బంతికే ఫించ్ ని అవుట్ చేశాడు. దీంతో క్రీజులో నిలదొక్కుకుని ఉన్న ఇద్దరు ఆటగాళ్లు పెవీలియన్ కు చేరినట్లయింది. ప్రస్తుతం ఆస్ట్రేలియా స్కోరు 6 వికెట్ల నష్టానికి 192 పరుగులు.
Go Back to Shorts
India
Australia
Shami
Cricket

More Telugu News