బన్నీని మెప్పించిన త్రివిక్రమ్ .. ఫిబ్రవరి నుంచి షూటింగ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బన్నీని మెప్పించిన త్రివిక్రమ్ .. ఫిబ్రవరి నుంచి షూటింగ్

  • బన్నీ తదుపరి సినిమాకి రంగం సిద్ధం 
  • జనవరిలో లాంచ్ చేసేందుకు రెడీ 
  • లైన్లో విక్రమ్ కుమార్ .. మారుతి   
బన్నీని గత రెండు సినిమాలు నిరాశపరిచాయి. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఆయన వున్నాడు. హిట్ పై ఎక్కువ భరోసా కావాలంటే త్రివిక్రమ్ తో చేయడమే కరెక్ట్ అనుకుని ఆయన కోసం వెయిట్ చేశాడు. తనపై బన్నీ పెట్టుకున్న నమ్మకానికి తగినట్టుగా త్రివిక్రమ్ ఒక కథను సిద్ధం చేసి బన్నీకి వినిపించాడు. ఆయన చెప్పిన మార్పులు .. చేర్పులు చేసి పూర్తి స్క్రిప్ట్ తో బన్నీని ఒప్పించాడు.

దాంతో ఈ సినిమాను జనవరిలో లాంచ్ చేయడానికి రంగం సిద్ధమైపోయింది. ఫిబ్రవరి నుంచి రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టనున్నట్టుగా తెలుస్తోంది. ఈలోగా నటీనటులు .. సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తిచేయనున్నారు. హారిక అండ్ హాసిని ... గీతా ఆర్ట్స్ వారు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ఈ సినిమా తరువాత బన్నీతో చేసేందుకు విక్రమ్ కుమార్ తో పాటు మారుతి కూడా సిద్ధంగా వున్నాడని అంటున్నారు.      
Allu Arjun
trivikram

More Telugu News