గోడ కట్టిన ఫించ్, హారిస్... లంచ్ వరకూ ఒక్క వికెట్ నూ తీయలేకపోయిన భారత బౌలర్లు!

  • పెర్త్ లో ప్రారంభమైన రెండో టెస్టు
  • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసిస్
  • లంచ్ సమయానికి 66 పరుగులు
పెర్త్ లో ఆస్ట్రేలియాతో మొదలైన రెండో టెస్టులో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ను ఎంచుకోగా, ఓపెనర్లు అరోన్ ఫించ్, మార్కస్ హారిస్ లు గోడ కట్టేశారు. లంచ్ విరామం వరకూ వీరిద్దరి జోడీని భారత బౌలర్లు విడదీయలేకపోయారు. ఎంతమంది బౌలర్లను మార్చినప్పటికీ, ఫలితం లేకపోయింది. ప్రస్తుతం 81 బంతులాడిన ఫించ్ 28 పరుగులతో, 76 బంతులాడిన హారిస్ 36 పరుగులతో ఆడుతుండగా, ఆసీస్ స్కోరు వికెట్ నష్టపోకుండా 66 పరుగులు. ఇషాంత్ శర్మ, బుమ్రా, ఉమేష్ యాదవ్, మహమ్మద్ షమీలు ప్రయత్నించినా, వికెట్ దక్కలేదు.
Go Back to Shorts
India
Australia
Cricket
Perth

More Telugu News