రాజస్తాన్, ఛత్తీస్ గఢ్ సీఎం అభ్యర్థులపై ప్రశ్నించిన మీడియా.. తెలివిగా తప్పించుకున్న సోనియాగాంధీ!
- మధ్యప్రదేశ్ లో కమల్ నాథ్ పేరు ఖరారు
- రాజస్తాన్ లో పైలెట్, గెహ్లాట్ పోటీ
- పార్లమెంటులో సోనియాకు మీడియా ప్రశ్న
అయితే విలేకరుల ప్రశ్నకు సోనియా టెన్షన్ పడకుండా నింపాదిగా స్పందిస్తూ..‘ఈ విషయమై దయచేసి రాహుల్ గాంధీనే అడగండి’ అని తెలివిగా జవాబిచ్చి తప్పించుకున్నారు. గతేడాది డిసెంబర్ 11న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్ బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన కొత్తల్లో ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అసోం రాష్ట్రాలను కాంగ్రెస్ కోల్పోయినప్పటికీ, తాజా విజయాలతో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసుకుంది. రాజస్థాన్‌లో సీఎం రేసులో ప్రస్తుతం సచిన్ పైలెట్, అశోక్ గెహ్లాట్ ఉన్నారు.