kcr: కేసీఆర్ గారు, అద్భుతమైన విజయం సాధించారు.. కంగ్రాచ్యులేషన్స్: మోదీ

షార్ట్స్‌లో చూడండి
నిన్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మిజోరాంలో ప్రాంతీయ పార్టీ అయిన మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్ఎఫ్) విజయాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.

మూడు రాష్ట్రాల్లో విజయం సాధించిన కాంగ్రెస్ కు శుభాకాంక్షలు తెలిపారు. 'కేసీఆర్ గారు, మీరు ఘన విజయాన్ని సాధించారు. కంగ్రాచ్యులేషన్స్' అంటూ అభినందించారు. అలాగే మిజోరాంలో గెలుపొందిన ఎంఎన్ఎఫ్ నాయకత్వానికి కూడా శుభాకాంక్షలు తెలిపారు.
Go Back to Shorts
kcr
congress
mnf
TRS
bjp
modi

More Telugu News