మోదీ పాలనలోని ఈవీఎంలకు రహస్యశక్తులున్నాయి.. జాగ్రత్త!: రాహుల్ గాంధీ
- మధ్యప్రదేశ్ లో ఈవీఎంలున్న బస్సును ఎత్తుకెళ్లారు
- పోలింగ్ పూర్తయిందని ఊపిరి పీల్చుకుంటే కుదరదు
- కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి
అప్రమత్తంగా ఉండాలని రాహుల్ అన్నారు.
ఈ సందర్భంగా, మధ్యప్రదేశ్ లో పోలింగ్ అనంతరం ఈవీఎంలు ఉన్న బస్సును కొందరు దొంగిలించిన విషయాన్ని ప్రస్తావించారు. కాగా, గత నెలాఖరులో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆ రాష్ట్రంలో పోలింగ్ ముగిసిన తర్వాత కొన్ని ఈవీఎంలు సేకరణ కేంద్రానికి ఆలస్యంగా చేరుకున్న వార్తల నేపథ్యంలోనే రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు.