చిరూ సినిమాతోను సందేశం ఇవ్వనున్న కొరటాల
- 'సైరా'తో బిజీగా చిరంజీవి
- స్క్రిప్ట్ పై కొరటాల కసరత్తు
- జనవరిలో లాంచ్ చేసే అవకాశం
కొరటాల సినిమాల్లో సందేశం తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ సినిమా కూడా సందేశంతో కూడినదిగానే ఉంటుందనేది తాజా సమాచారం. యాక్షన్ సన్నివేశాలతో పాటు రైతు సమస్యలకి సంబంధించిన సందేశం ఉంటుందని అంటున్నారు. రైతు పాత్రలో చిరంజీవి కనిపిస్తాడని చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. జనవరిలో ఈ సినిమాను లాంచ్ చేసి, ఆ తరువాత రెగ్యులర్ షూటింగును మొదలుపెట్టే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అంటున్నారు.