nani: దిల్ రాజు మల్టీ స్టారర్ లో నాని, దుల్కర్ సల్మాన్

షార్ట్స్‌లో చూడండి
ఈ మధ్య కాలంలో వచ్చిన నాని సినిమాలు ఆశించిన స్థాయిలో ఆదరణ పొందలేదు. దాంతో ఆయన తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ప్రస్తుతం 'జెర్సీ' సినిమా చేస్తోన్న ఆయన, ఆ తరువాత సినిమాను విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. అందుకు సంబంధించిన పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమా తరువాత ఇంద్రగంటి మోహనకృష్ణతో కలిసి నాని సెట్స్ పైకి వెళ్లనున్నాడు .. దీనికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరించనున్నాడు. నానితో '96' మూవీని రీమేక్ చేద్దామనుకున్న దిల్ రాజు, ఇంద్రగంటి సిద్ధం చేసిన కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇది మల్టీ స్టారర్ మూవీ. అందువలన ఈ సినిమాలో మరో యువ హీరో అవసరమయ్యాడు. పాత్ర పరంగా దుల్కర్ సల్మాన్ అయితే సరిగ్గా సరిపోతాడని భావించిన దిల్ రాజు ఆయనను సంప్రదిస్తున్నారట. దుల్కర్ అంగీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకుంటున్నారు. త్వరలోనే మిగతా వివరాలు తెలియనున్నాయి.  
Go Back to Shorts
nani
dulquer

More Telugu News